![]() |
![]() |

స్టార్ మా టీవీ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో.. కావ్యకి రాజ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు. నా క్యాబిన్ ఎక్కడ అని రాజ్ ని కావ్య అడుగగా.. రాజ్ చిరాకు పడతాడు. వెళ్లి కాఫీ తీసుకొని రా అని రాజ్ అనగానే నేనేం ఫ్యూన్ కానని కావ్య అంటుంది. మీరు నాకు వర్క్ చెప్పేవరకు మిమ్మల్ని చూస్తున్నే ఉంటానని కావ్య తన ముందు చైర్ లో కూర్చొని ఉంటుంది. రాజ్ కోపంగా శృతిని పిలిచి తనకి క్యాబిన్ ఇంకా చెయ్యాల్సిన వర్క్ చెప్పమని చెప్తాడు. నిన్ను కాదు ఈ లెటర్ పంపిన డాడ్ ని అనాలంటు సుభాష్ కి కాల్ చేసి.. ఎందుకు ఇలా పది సంవత్సరాల గారంటీతో అపాయింట్మెంట్ లెటర్ పంపారని అడుగుతాడు. అలా రాజ్ అనగానే అది మీ అమ్మ చేయమందని చెప్తాడు.
ఆ తర్వాత అప్పుకి తన ఓనర్ కాల్ చేసి త్వరగా వస్తానని అన్నావ్ జాయిన్ అయిన రోజే ఇలా చేస్తున్నావంటూ కోప్పడతాడు. దాంతో అప్పు భోజనం చెయ్యకుండానే వెళ్తుంది. కాసేపటికి అప్పుకి పెళ్లి చెయ్యాలి. మంచి సంబంధం తీసుకొని రండి అని కృష్ణమూర్తికి కనకం చెప్తుంది. మంచి సంబంధం ఎలా తీసుకొని రాగలం.. ఆ రోజు అందరి ముందు పెళ్లిలో అప్పుని దోషిని చేశారని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ ఇద్దరు రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ పలావ్ తిన్న కళ్యాణ్.. ఛీ ఇలా ఉంది ఏంటి? మా వదిన చేస్తే సూపర్ ఉంటుందని అనగానే ఇక్కడ కూడ మీ వదిన గోలనేనా అంటు అనామిక కోప్పడుతుంది. నువ్వు ఆఫీస్ కి వెళ్లొచ్చు కదా అని అనామిక అనగానే.. నువ్వు నా కవితలు చూసే కాద ఇష్టపడ్డావని కళ్యాణ్ అంటాడు. మరి లేకపోతే నీ ఆస్తులు చుసి అనుకున్నావా? నువ్వు పరిచయం అయ్యేంత వరకు.. మీరు ఎవరో కూడా తెలియదని అనామిక అంటుంది. మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేంజ్ అవుతున్నావని కళ్యాణ్ అడుగుతాడు.. ఆ తర్వాత అప్పు అదే రెస్టారెంట్ కి వస్తుంది. తనని చూసిన అనామిక కావాలనే కళ్యాణ్ కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. సరదాగా ఉన్నట్లు నటిస్తుంది. అది చూసి అప్పు బాధపడుతుంది.
ఆ తర్వాత ఈ డిజైన్స్ ఏంటి అంటు స్టాఫ్ పై రాజ్ అరుస్తు ఉంటాడు. అప్పుడే రాజ్ కి శృతి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో రాజ్ వెళ్తుంటాడు. శ్వేత దగ్గరికి వెళ్తున్నాడు కావచ్చని కావ్య కూడా రాజ్ వెనకాలే వెళ్తుంది. మరొకవైపు శ్వేత దగ్గరికి తన భర్త వచ్చి.. ఆస్తులు నా పేరు మీద రాయి, విడాకులు వద్దంటు కొడతాడు. అప్పుడే రాజ్ వచ్చి నువ్వు రేపు ఎలాగైనా విడాకుల పేపర్స్ పై సంతకం చెయ్యాలని శ్వేత భర్తకి వార్నింగ్ ఇస్తాడు. కాసేపటికి అతను వెళ్ళిపోయాక శ్వేత బయపడుతుంటే రాజ్ ధైర్యం చెప్తాడు. అప్పుడే అక్కడికి కావ్య వచ్చి.. రాజ్ శ్వేతలని చూస్తుంది. నీకు నేను ఉన్నానని శ్వేతతో రాజ్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది.. తరువాయి భాగంలో మీరు ఎక్కడకి వెళ్లారని కావ్య అడుగుతుంది. నా గురించి నీకు ఎందుకని రాజ్ అనగానే.. మీ భార్యని నేను. శ్వేతని కాదని కావ్య అనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |